Prakasam District Information Portal. Prakasam District Events, Festivals and news updates. Prakasam District photos.all about Prakasam District. Ongole Directory.

Welcome To Ongole City | Ongole Bull

Welcome to Ongole City.Land of Ongole Bull.

Thank You

Good Morning to All

Good Night

Good.....

Good Morning

good....

Good Morning..

good...

Wednesday, 25 September 2013

Sri Lakshmi Chennakesava Swamy Temple at Markapur

Sri Lakshmi Chennakesava Swamy Temple-Markapur | Prakasam District

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి మార్కాపురం 

శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం ఇక్కడి విశేషం. కృతయుగంలో ఏనుగులు సంచరించిన అరణ్యంగా త్రేతా యుగంలో మహర్షులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా, ద్వాపర యుగంలో దీవి నుండి భువికి దేవతలు దిగి వచ్చి స్వామిని ఆరాధించుకున్న దివ్య ప్రదేశంగా, కలియుగంలో మారికా, మారకులనెడి యాదవ దంపతులను తరింపజేసిన పుణ్యక్షేత్రంగా ఈ దేవస్థానాంనకు పేరుంది. అందువల్లనే మారకాపురం అనేది మార్కాపురం అయ్యిండంటారు.
              ఇక్కడ శ్రీ స్వామి వారి ఎడమ చేతి యందు శేష చక్రం ఉండటం విశేషం . మార్కండేయ మహర్షి తపస్సును కేసి అనే రాక్షసుడు భంగాపరచే ప్రయత్నం చేయగా శ్రీ మహా విష్ణువు తనకు పాంపుగా ఉన్న ఆది శేషున్ణి చక్ర రూపంగా రాక్షసుని పై ప్రయోగించడని పురాణ గాధ ఉన్నది. ఇక్కడి అమ్మవారు శ్రీ రాజ్య లక్ష్మి. ఈ ఆలయ నిర్మాణం 15 వ శతాబ్ధంలో విజయనగర చక్రవర్తులు చేసినట్లు, శాసన సాక్ష్యం ఉంది. సూర్యుని కాంతి తరంగ పరంపర ఇక్కడి గర్భ గుదిలోని మూల విరాట్టు పై ప్రసారం కావడం ఆనాటి శాస్త్రజ్ఞుల ప్రతిభ.
              మార్కాపురాన్ని పూర్వం మారీకాపురమని వ్యవహరించేవారు. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి రాజ్య లక్ష్మి సమేతుడై కొలువైన స్థలమిది. ఈ ఆలయంలో శిల్పుల ప్రతిభా పాటవాలు అడుగడుగునా మనకు గోచారమవుతాయి. ఆలయానికి ముందున్న మన్యరంగా మండపమును శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించినట్లు ప్రతీతి. ఇరువురు అన్నదమ్ములైనా శిల్పులు తమ మధ్య ఒక వస్త్రాన్ని అడ్డు పెట్టుకొని కేవలం శబ్ధాగ్రహణ నైపుణ్యంతో ఇద్దరు ఒకే విధమైన శిల్పాలను చెక్కారని ప్రతీతి. నేటికి ఈ రెండు శిల్పాలున్న స్థంభాలను అన్నదమ్ముల స్తంభాలని వ్యవహరిస్తుంటారు (పిలుస్తుంటారు). Read More >>  about Markapuram Temple History
Share:

Sunday, 22 September 2013

Pilgrim places in Prakasam Disrtict

Pilgrim places in Prakasam Disrtict 

History of Famous Temples in Prakasam District
Sri Ragunayaka Swamy Temple | Chadalawada
Support Ongolebull.com
If you want to add More Information for this article. Please write us, about Famous temple at your villages. Famous festivals in your area. Our Email Address : ongolebull.com@gmail.com
Share:

Thursday, 12 September 2013

Kanaparthi Village History

Kanaparti History - Naguluppalapadu Mandalam | Prakasam District 

కనపర్తి చరిత్ర సముద్రతీరంలోని కనపర్తి ప్రాచీన శైవ క్షేత్రం, ప్రకాశం జిల్లా లో ఎక్కడ కానరనన్ని శివలింగాలు, నందులు, అడుగడుగునా ఇక్కడ కనిపిస్తాయి. నాగులుప్పలపాడు మండలం లోని కనపర్తి గ్రామం శైవామాత విజృంభణ సమయంలో ఒక వెలుగు వెలిగింది. ఈ గ్రామం పూర్వ నామం కనకాపురి. ఇక్కడ ఉన్నఈశ్వరాలయాన్ని సుమారు 2 వేల ఏళ్ల క్రిందట నిర్మించారని చెబుతారు. గతంలో ఎక్కడ 101 శివలింగాలు, 101 నందులు, 101 బావులు ఉండేవని అంతానికి ఆధారాలు ఉన్నాయి. More >> Kanaparthi Village History
Share:

Saturday, 7 September 2013

Tradition to donate cattle at Simhachalam Temple

Devotees from the interior villages have A Tradition to donate cattle at Simhachalam Temple

శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - సింహాచలం 

అప్పన్న సన్నిదిలోకోడెదూడాల మ్రొక్కుబడి 

Tradition to donate Cows or Ox at Simhachalam Temple Goshala
Simhachalm Temple
శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో గ్రామీణ ప్రాంతములు నుండి వచ్చిన భక్తులు ఆవులను, కోడె దూదలను మొక్కుబడి గా సమర్పణ చేయుట చాలాకాలము నుండి ఆచారము గా వస్తుంది. ప్రాచీన కాలం నాటి సింహాచల శాసనములలో శ్రీవారహలక్ష్మీనృసింహస్వామి వారి అభిషేకానికి, సుప్రభాతానికి, రాజభోగానికి, పవళింపు సేవకి స్వామి వారి ఉపయోగం కోసం పాలు, పెరుగుల కోసం ఎందరో మహానుభావులు కేవలం దేశీయ జాతి ఆవులను వత్సలలొ (పెయ్య) పాలు ఇస్తున్న ఆవులను సమర్పిస్తూ వాటి ఆహారములకు, పోషణకు, స్మరక్షకుల కొరకు కొంత భూమిని కూడా సమర్పించినట్లు ఆధారాలు కానవస్తున్నాయి. కోడె దూదలను భక్తులు కొండకు తీసుకు వచ్చి స్వామి వారి కి చూపించి మరల వారే వారి గ్రామాలకు తీసుకొనిపోయే చరము చాలా కాలం నుండి ఉన్నది. సంతానార్దులయిన దంపతులు వారికి మగబిడ్ద పుడితే కోడెదూడని, అడబిడ్ద పుడితే ఆవు పెయ్యని స్వామి వారికి సమర్పిస్తామని మ్రొక్కుకొని సమర్పణలు చేసేడీవారు. పత్రం కాని, ఫలం కాని, పుష్పం కాని, గోవుణి కాని, కోడె దూడను కాని, స్వామి వారికి సమర్పించినప్పుడు యోగ్యమైనవే సమర్పించాలి. మంచి ఆరోగ్యవంతమైనవి , బలమైనవి దేశియమైనవి (దేశవాళీ) మాత్రమే సమర్పించాలి. అలాగైతేనే ఆ మొక్కుబడి తిరు ఫలప్రదమవుతుంది. స్వగ్రామము నుండి నడవగలిగినవి, తల్లిపాలు తగు వయస్సును మించినవి మాత్రమే సమర్పించాలి. పూర్వకాలం అలాగే సమర్పించేవారు. ఇప్పటి కాలంలో పై నియమాలు పాటించక, లేగ దూదలని ఆధునిక వాహనములలో కొండకు చేర్చి స్వామి సన్నిధిలో వదిలేస్తున్నారు. ఇది వారికి ఎంతమాత్రం శ్రేయస్సు కాదు. More about Tradition to donate cattle at Simhachalam Temple
Share:

Monday, 2 September 2013

Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple at Malakonda

శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం - మాలకొండ | Prakasam District

Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple

 ప్రకాశం జిల్లా , కందుకురుకు నైరుతి దిశలో సుమారు ఇరువై మైళ్ళ దూరంలో ఉన్న ఈ మాల్యాద్రి పై భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన నవనారసింహుల లో ఒకరైన శ్రీ జ్వాలా నరసింహస్వామి తన దేవేరీ శ్రీ మహాలక్ష్మి తో కొలువైయండీ భక్తుల పాలిట కల్పతరువై ఉన్నారు. స్థల పురాణం : శ్రీ విష్ణువు శ్రీ మహాలక్ష్మి తో భూలోకం లో విహరించగోరి తన ' వనమాల ' ను పర్వతాకారం దాల్చామని కొరడని వనమాల "మాల్యాద్రి" గా వెలసిందనీ పురాణాగాధ ఉంది. ఆగస్త్య మహముని ఈ మాల్యాద్రి పై తపస్సు చేసాడని ఆ తపస్సుకు మెచ్చి ఎర్రని కాంతి తో జ్వలారుపమున స్వామి ప్రత్యక్షమైనాడని అందువలన ఈ స్వామి జ్వాలా నరసింహునీగా ప్రసిద్ధిగాంచాడని స్థలపూరాణంలో చెప్పబడినది.More Info >> Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple History
Share:

Tripurantakam Bala Tripurasundari Devi Temple Prakasam District


త్రిపురాంతకం-Tripurantakam Bala Tripurasundari Devi Temple | Prakasam District

ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. కర్నూలు - గుంటూరు రహదారిలోని వినుకొండకు 35 కి. మీ. రక్తనగాఖ్య నగరానికి (యర్రగొండపాలెం) 19 కి. మీ. దూరంలో ఉంది. త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. స్వామి వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపిఠము గుండా క్రిందకు జారి పాతళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి. More Info >> Tripurantakam
Share:

Labels